Thursday, 18 July 2013

atu nuvve itu nuvve, song from current , current movie song lyirics

అటు నువ్వే ఇటు నువ్వే,
మనసెటు చూస్తే అటు నువ్వే,
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే.
అటు నువ్వే ఇటు నువ్వే ,
అలికిడి వింటే అది నువ్వే,
అదమరుపయినా పెదవుల పైన ప్రతిమాట నువ్వే.
అపుడు ఇపుడు ఎపుడైనా ,
నా చిరునవ్వే నీవలన,
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే.
పరిచయమంతా గతమేనా,
గురుతుకు రానా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావు లే


రంగు రూపమంటూ లేనే లేనిదీ ప్రేమ ,
చుట్టూ శూన్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది.
దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమ ,
నీలా చెంత చేరి నను మాటాడిస్తుంది,
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావు గా.
ఎద మారు మూలలో ఒదిగున్న ప్రాణమై ,
నువు లేను నేను లేనే లేను అనిపించావు గా

అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే.
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే ఆదమరుపయినా పెదవుల పైన ప్రతి మాట నువ్వే.

నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్ప కుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఒంటరి చేసావే
ఏకాంత వేళ లో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండ లేదురా
నీ పేరు లేని ప్రేమనైన ఊహించేదెలా.

No comments:

Post a Comment