Thursday, 18 July 2013

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల song from anandam, anandam movie song lyirics

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల
ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా
ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన
అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా..కనులు తెరిచినా....
పెదవుల్లో దరహాసం నీకోసం పూసింది
నీ జతలో సంతోషం పంచాలనిపిస్తుంది
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతుంది
అయితేనే అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని లోకం అనుకుంటుంది
కానీ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని
కనులు తెరిచినా.....
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటుంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తుంది
నాక్కూడా కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన ఋజువియ్యమంది మరి
కనులు తెరిచినా....

No comments:

Post a Comment