Thursday, 18 July 2013

మరు మల్లెల వాన మృదువైన నా చెలి పైన song from SOLO , SOLO song lyirics

మరు మల్లెల వాన మృదువైన నా చెలి పైన 
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా 
తారకవి ఎన్ని తళుకులో చాలవే రెండు కన్నులు 
మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తనలోని ఒంపులు 
లాగి నన్ను కొడుతున్నా లాలి పాడినట్టుందే 
విసుగు రాదు ఏమన్నా చంటి పాపనా 

జక్కన చెక్కిన శిల్పమే ఇక కనబడదే 
ఆ చైత్రము  ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే 
సృష్టిలో అద్భుతం నువ్వే కదా కాదనగలరా 
నిముషానికే క్షణాలను ఓ లక్షగా మార్చేయమనరా 
అలనాటి యుద్దాలే జరుగుతాయేమో నీలాంటి అందాన్ని తట్టుకోలేరేమో 
శ్రీ రాముడే శ్రీ కృష్ణుడై  మారేంతలా 

ఆయువై నువ్వు ఆశవై ఓ ఘోషవై  నువ్వు వినపడవా 
ప్రతి రాతిరి నువ్వు రేపటి ఓ రూపమై చెలి కనపడవా 
తీయని ఈ హాయిని నేనేమని అనగలను 
ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను 
మనువాడమన్నారు  సప్త ఋషులంతా 
కొనియాడుతున్నారు అష్ట కవులే అంతా 
తారాగణం మనమే అని తెలిసిందెలా 

No comments:

Post a Comment